ప్రస్తుతం కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకుల మధ్యన మాటల వార్ నడుస్తోంది. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుండి అనర్హత వేటు వేయడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కోర్ట్ లో కేసు జరుగుతోంది… ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. లోక్ సభ లో అయినా లేదా శాసనసభ లో అయినా ఏదైనా ఒక బిల్లును ప్రవేశ పెట్టి పాస్ అవ్వాలంటే దానిపై ఖచ్చితంగా చర్చలు జరగాలి.
కానీ మల్లికార్జున ఖర్గే చెబుతున్న ప్రకారం బీజేపీ ప్రభుత్వంలో పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన ఒక బిల్లును ఎటువంటి చర్చ లేకుండా రూ. 50 లక్షల కోట్ల రూపాయల బిల్లును 12 నిముషాల వ్యవధిలో పాస్ చేశారని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించకుండా ఇష్టానుసారంగా చేశారు బీజేపీ పెద్దలు. అందుకే ఇప్పటికైనా అదానీ ఆర్ధిక నేరాలపైనా విచారణ చేయాలనీ డిమాండ్ చేశారు మల్లికార్జున ఖర్గే.