చంద్రబాబు నెల్లూరు వచ్చారు అంటేనే జిల్లా వాసులు బెంబేలెత్తుతారన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి . ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి ఏమి చేయలేదు కాబట్టి సెల్ఫీ ఛాలెంజ్ అని టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ తీసి పెట్టారని, సిగ్గు..శరం ఉండి ఉంటే ఐదేళ్లలో మీరు కట్టిన ఇళ్లను ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా.. ‘కమీషన్ల కోసం ఇళ్లు నిర్మించారు..ఇది అందరికీ తెలుసు. చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం సిగ్గుచేటు. ఈడీ విచారణ చేస్తుంటే మీ అవినీతి బాగోతం ఒక్కకొక్కటి బయటపడుతోంది. ఐదేళ్లలో ఇల్లు ఇవ్వలేకపోయాను అని సెల్ఫీ పెట్టాల్సింది.
మా ప్రభుత్వ హయాంలో ఎంత మందికి ఇళ్లు ఇచ్చామో తెలుసుకోవాలి. సంగం బ్యారేజి, నెల్లూరు బ్యారేజి వద్ద సెల్ఫీ తీసుకుని సిగ్గుపడాలి. నువ్వు చేయలేకపోయిన పనులు మేము చేసి చూపించాం అని సిగ్గుతో చంద్రబాబు తలదించుకోవాలి. దరిద్రం, అరిష్టం, కరువు, కాటకాలకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.
అలాంటి బాబు… జగన్మోహన్ రెడ్డిని దరిద్రం, అరిష్టం అనడం సరికాదు. ఓడిపోతాం అని తెలవడంతో పంచాయతీ.. ఎంపిటిసి, జడ్పిటిసీ ఎంమికల్లో పోటీ చేయలేకపోయావు. నిన్ను నమ్మి ఎంతమంది రోడ్డున పడ్డారో, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో చంద్రబాబు తెలుసుకోవాలి.. వాలంటీర్ల వ్యవస్థ గురించి చంద్రబాబు నీచంగా మాట్లాడటం దారుణం. మీ పక్కన ప్రజలు ఉంటే 2019లో 23 సీట్లకి ఎందుకు పరిమితం చేశారో చంద్రబాబు చెప్పాలి.
చంద్రబాబు చుట్టూ సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి… ఈయన రౌడీయిజం గురించి సిగ్గులేకుండా మాట్లాడటం సరికాదు. టీడీపీ సోషల్ మీడియాలో తప్ప జనాల్లో ఎప్పుడో చచ్చిపోయింది. నువ్వే మా నమ్మకం జగనన్న అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాం. సమస్యల పరిష్కారానికి కొత్త మంత్రిత్వ శాఖ ఇస్తారట, అసలు ఈయన అధికారంలోకి ఎప్పుడు రావాలి. సర్వేలో గెలవబోమనే సీట్లని బీసీలకి ఇవ్వడం చంద్రబాబుకు అలవాటు. తన కూతురుని చంద్రబాబుకి ఇచ్చి పెళ్లిచేయడమే ఎన్టీఆర్ చేసిన తప్పు. ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని చంద్రబాబు చేస్తా అన్నాడు…. ఆ పని చేస్తే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది. చంద్రబాబుకు కమిట్మెంట్ అనే పదం పలకడానికి కూడా అర్హతే లేదు. జగన్ లాంటి వ్యక్తిని క్యాన్సర్ గడ్డ అన్నాడు…. నిలువెత్తు విషం దాచుకున్న నువ్వు జగన్ గారి గురించి మాట్లాడటం సరికాదు. – వై నాట్ పులివెందుల అన్నావ్… నీ స్థాయి పులివెందుల వరకే… మేము వై నాట్ 175 అంటున్నాం. చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ విషాదం… కందుకూరులో కాలు పెట్టాడు… 8 మంది చనిపోయారు. అసలు 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని దమ్ముంటే చెప్పగలవా చంద్రబాబు. నెల్లూరు జిల్లాకు చంద్రబాబు చేసింది శూన్యం’ అని మంత్రి కాకాణి ఫైర్ అయ్యారు.