ఐపీఎల్ 2023 : షాకింగ్ డెసిషన్ తీసుకున్న SRH !

-

ఈ రోజు మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్ క్రామ్ బ్యాటింగ్ తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 9 మ్యాచ్ లు జరుగగా ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు ఆరు సార్లు గెలవగా , రెండవ సారి బ్యాటింగ్ చేసిన వాళ్ళు కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే గెలిచాయి. ఈ సమీకరణాలను అంచనా వేసుకుని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ చాలా తెలివిగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా టీం కూర్పులోన్నూ రెండు మార్పులు చేసింది జట్టు.

మొదటగా ఫజల్ హాక్ బదులుగా మార్ క్రామ్ ఎంట్రీ ఇవ్వగా, ఉపేంద్ర యాదవ్ కు బదులుగా అన్మోల్ ప్రీత్ సింగ్ ను కీపర్ గా తీసుకుంది సన్ రైజర్స్ యాజమాన్యం. ఇక బౌలింగ్ లో బాగా రాణించిన ఫజల్ హాక్ ఫరూఖీని పక్కన పెట్టడం నిజంగా షాకింగ్ నిర్ణయం అని చెప్పాలి. మరి ఏ విధంగా మిగిలిన ఆటగాళ్లు రాణిస్తారు అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news