అమ్మాయిలు ఏ వయసులో పెళ్లి చేసుకుంటే పిల్లలు త్వరగా పుడతారు..?

-

ఒకప్పుడు అంటే ఆడపిల్లలకు ఇంటర్‌, డిగ్రీ అయిపోగానే పెళ్లిళ్లు చేసేవాళ్లు.. కానీ ఇప్పుడు కాలం మారింది.. పెళ్లి త్వరగా చేసుకోవడానికి అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు ఎవ్వరూ ఇష్టపడటం లేదు. సర్వేల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే.. అసలు లైఫ్‌లో పెళ్లి అంత ముఖ్యం కాదు.. చేసుకోవాలని లేదు అని ఈ కాలం యువత అనుకుంటున్నారట. కొంతమంది అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకుంటున్నారట.. అసలు ఆడపిల్లలు ఏ వయసులో పెళ్లి చేసుకోవడం బెటర్‌.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటే పిల్లలు త్వరగా పుడతారు ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!

 

స్త్రీలు పురుషుల‌తో స‌మానంగా అన్నీ రంగాల్లో రాణించాల‌నుకోవ‌డంలో ఎటువంటి త‌ప్పు లేదు. దానివల్ల పెళ్లి కాస్త ఆలస్యం అవుతుంది.. అయితే ఒక అమ్మాయి జ‌న్మించేట‌ప్పుడు ప‌రిమిత‌మైన అండాల‌తోనే జ‌న్మిస్తారట… ఆడ‌పిల్ల పుష్ప‌వ‌తి అయిన‌ప్ప‌టి నుంచి ఈ అండాలు విడుద‌ల‌వ్వ‌డం ప్రారంభ‌మ‌వుతాయి. ఇలా అండాలు 45 నుంచి 50 సంవ‌త్స‌రాల వ‌ర‌కు విడుద‌లై ఆ త‌రువాత ఆగిపోతాయి. జీవించే కాలం పెరుగుతున్న‌ప్ప‌టికి స్త్రీలల్లో అండాల సంఖ్య మాత్రం పెర‌గ‌దు. కొన్ని వేల సంవ‌త్స‌రాల నుంచి కూడా స్త్రీలల్లో ఈ అండాల సంఖ్య పెర‌గ‌డం లేదు. అదే విధంగా 20 నుంచి 25 సంవ‌త్సరాల మ‌ధ్యలో స్త్రీలల్లో అధికంగా అండాలు విడుద‌ల అవుతాయి. ఈ స‌మ‌యంలోనే రుతుక్ర‌మం స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డం, త్వ‌ర‌గా గ‌ర్భం ధ‌రించే అవ‌కాశాలు అధికంగా ఉంటాయి. 25 నుంచి 30 సంవ‌త్సరాల వ‌ర‌కు కూడా గర్భం దాల్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కానీ 30 సంవ‌త్స‌రాల త‌రువాత గ‌ర్భం దాల్చే అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతాయి..స్త్రీల వ‌య‌సు పెరిగే కొద్ది వారిలో విడుద‌ల అయ్యే అండాల సంఖ్య త‌గ్గుతుంది. దీంతో వారు సంతానాన్ని పొందే అవ‌కాశాలు తక్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

వ‌య‌సు పెరిగే కొద్ది అండాలు త‌క్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌డంతో పాటు శారీర‌కంగా కూడా చాలా మార్పులు జ‌రుగుతాయి. దీంతో వారి గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో అనేక స‌మ‌స్య‌లు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్లు దాటిన త‌రువాత గ‌ర్భం దాల్చ‌డం వ‌ల్ల గ‌ర్భ‌ధార‌ణ షుగ‌ర్, బీపీ, థైరాయిడ్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్ల త‌రువాత గ‌ర్భం దాల్చ‌డం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంది. స‌రైన స‌మ‌యంలో వివాహం చేసుకోవ‌డం వ‌ల్ల సంతాన‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర‌వ‌కుండా ఉంటాయ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news