ప్రతి శుక్రవారం రివ్యూలు రాసుకోపో.. మారుతి ఏంటి సెటైర్..?

-

సినిమా రిజల్ట్ రివ్యూల మీద ఆధారపడి ఉంటుందా..? ఇది దర్శక నిర్మాతలకే కాదు రాస్తున్న రివ్యూ రైటర్స్ కూడా చెప్పలేని ఓ ప్రశ్న. అయితే బాగున్న సినిమాకు మంచి రివ్యూలే కాదు రివ్యూలు నెగటివ్ గా వచ్చి ఆడియెన్స్ కు నచ్చితే ఆ సినిమా సూపర్ హిట్ అవుద్ది. ఇక బాగాలేని సినిమాకు బాగుందని రివ్యూ రాసినా ఎవరు చూడరు.

అయితే ఆల్రెడీ టాక్ బాగా రాని సినిమాకు రివ్యూస్ కూడా నెగటివ్ గా వస్తే కచ్చితంగా కలక్షన్స్ మీద తేడా కొడుతుంది. అందుకే ఛాన్స్ దొరికితే రివ్యూస్ మీద, రివ్యూ రైటర్స్ మీద తమ అక్కసు చూపిస్తారు దర్శకులు. ఇక ఈరోజు రిలీజ్ అయిన నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడులో కూడా నీకు మీడియా నాలెడ్జ్ ఎక్కువైంది పోయి ప్రతి శుక్రవారం సినిమా చూసి రివ్యూలు రాసుకో అని రఘుబాబు తన దగ్గర స్టూడెంట్ ను అంటాడు.

ప్రతి శుక్రవారం సినిమాలు చూసి రివ్యూలు రాసుకో అన్న డైలాగ్ మారుతి ఎందుకు వాడినట్టో అని చర్చలు జరుపుతున్నారు. కేవలం కామెడీ పండించేందుకే కాదు రివ్యూ రైటర్స్ మీద పంచ్ వేసేందుకు ఈ డైలాగ్ రాసి ఉంటాడని చెప్పొచ్చు. తన ప్రతి సినిమాకు కథ ఎలా ఉన్నా కామెడీ ఎంటర్టైనింగ్ మిస్ అవ్వని మారుతి శైలజా రెడ్డిలో అది కాస్త మిస్ అయ్యాడనిపిస్తుంది. సినిమా సెకండ్ హాఫ్ రొటీన్ గా నడిపించాడని టాక్ వచ్చింది. అందుకే చైతుతో పాటుగా పోటీలో దిగిన యూటర్న్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news