ఎలుకను చంపాడని మూడేళ్లు జైలు శిక్ష

-

2022 సంవత్సరం, నవంబర్‌ నెలలో ఒక 30 ఏళ్ల మనోజ్ కుమార్ ఎలుకను ఇటుకతో కట్టి కాలువలో ముంచి చంపాడు. ఆ వ్యక్తిపై యూపీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేపట్టారు. ఇలాంటి కేసులో చార్జిషీట్ దాఖలు చేయడం బహుశా యూపీలో ఇదే మొదటిసారి అని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. మనోజ్ కుమార్ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటాడు. ఇతను ఒక కుమ్మరి. గత సంవత్సరం IPC సెక్షన్ 429 (పశువులను చంపడం లేదా వికలాంగులను చేయడం) కింద జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టంలోని సెక్షన్ 11 (1) కింద పోలీసులు ఇతని మీద కేసు నమోదు చేశారు.
స్థానిక జంతు హక్కుల కార్యకర్త వికేంద్ర శర్మ అనే వ్యక్తి మనోజ్ కుమార్ పై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎలుకను రాయితో కట్టి చనిపోయేలా చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు మనోజ్ కుమార్ పై చర్యలు తీసుకున్నారు. చాలా కొద్ధి రోజుల్లోనే స్థానిక కోర్టు మనోజ్ కుమార్‌కు బెయిల్ ఇచ్చింది.

चूहा मारने की दवाई और चूहेदानी पर रोक नहीं, तो चूहे की हत्या पर कैसे लगी 30  पन्ने की चार्जशीट? | charge sheet on rat killing Know what is the law, how

ఎలుక శవపరీక్ష తరువాత మరణానికి కారణం “డ్రై డ్రౌనింగ్” అని నిర్ధారించబడింది. శవపరీక్ష నివేదిక, వీడియో ఆధారాలు, స్థానికుల వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు అధికారి మనోజ్ పై చార్జిషీట్‌ దాఖలు చేశారని, సర్కిల్‌ అధికారి ధ్రువీకరణ అనంతరం కోర్టు ముందు సమర్పిస్తామని పోలీసులు వెల్లడించారు. అయితే “ఎలుకలు చాలా మందికి ఎలుకలు మాత్రమే కావచ్చు, కానీ దానిని చంపిన విధానం జంతువులపై క్రూరత్వం కింద వస్తుంది. అందుకే, నేను ఈ కేసు ఫైల్ చేశా”నని ఫిర్యాదుదారు వెల్లడించారు. “భవిష్యత్తులో మరే ఇతర జంతువుతోనూ ఇలా చేయడానికి ఎవరూ ప్రయత్నించకుండా చూసుకోండి” అని చెప్పారు. శవపరీక్ష కోసం ఎలుక మృతదేహాన్ని IVRI- బరేలీకి పంపారని, దానిని కారులో ల్యాబ్ కాంప్లెక్స్‌కు తరలించడానికి అయ్యే ఖర్చులన్నీ చెల్లించినట్టు వెల్లడించారు.
ఇంకో వైపు మనోజ్ కుమార్, తాను ఎలుకను చంపానని, వీడియో చిత్రీకరించిన సమయంలోనే తాను దానిని కాలువలో నుంచి బయటకు తీశానని తెలిపాడు. ఈ కేసులో దాఖలైన ఛార్జిషీటును సర్కిల్ అధికారి.. దర్యాప్తు అధికారికి సమర్పించారు. తనకు తెలిసినంతవరకు ఇది బహుశా యూపీలోనే నమోదైన మొదటి కేసని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news