భారత్‌లోకి జూన్ లో నైరుతి రుతుపవనాల ఆగమనం

-

మన భారత దేశం లో దేశంలో అత్యధిక వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్లే నమోదవుతుంది అన్న సంగతి తెలిసిందే. అయితే , దీనికి సంబంధించి భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తాజాగా అంచనాలను వెల్లడించింది. ఈ సంవత్సరం, రుతుపవనాల సీజన్ లో దేశంలోని చాలా భాగాల్లో సాధారణ స్థాయిలోనే వర్షపాతం నమోదవుతుందని . వాయవ్య తెలిపింది ఐఎండీ. భారతం, పశ్చిమ, మధ్య, ఈశాన్యభారతంలో సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.

Rainy Season Pictures | Download Free Images on Unsplash

దీనిపై కేంద్రం భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ స్పందించారు. మొత్తమ్మీద 96 శాతం వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశాలున్నట్లు సమాచారం. ఈ అంచనా 5 శాతం అటూ ఇటూగా ఉండొచ్చని అన్నారు అధికారులు. ప్రాథమిక అంచనాల ప్రకారం దీర్ఘకాల వర్షపాత సగటు 87 సెంటీమీటర్లు అని తెలిపారు.

ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెటియరాలజీ ఎం.మొహాపాత్ర మాట్లాడుతూ, సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు 67 శాతం అవకాశాలున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇంతకుముందు లాగే ఎల్ నినో పరిస్థితుల్లో భారత్ లో రుతుపవనాల సీజన్ మెరుగైన వర్షపాతాన్నే అందిస్తుందని అంచనా. ఈసారి ఎల్ నినో నైరుతి రుతుపవనాల సీజన్ ద్వితీయార్థంలో ప్రభావం చూపే అవకాశాలున్నట్టు సమాచారం. 1951 నుంచి 2022 వరకు చూస్తే 40 శాతం ఎల్ నినో సంవత్సరాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news