‘ సైరా ‘ ఫ‌స్ట్ డే ప్రీమియ‌ర్ క‌లెక్ష‌న్లు వ‌చ్చేశాయ్‌..

-

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి నేడు ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. తెలుగు – త‌మిళ్ – క‌న్న‌డం – హిందీ – మ‌ళ‌యాళం మొత్తం ఐదు భాషలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా చిత్రంపై విపరీతమైన అంచనాలున్నాయి. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల నేప‌థ్యంలోనే సైరా ప్రీమియ‌ర్ల‌లో అదిరిపోయే వ‌సూళ్లు రాబ‌ట్టింది.

తాజా సమాచారం ప్రకారం 269 లొకేషన్స్ నుండి సైరా $7,39,136 డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఈ ట్రెండ్ కొనసాగితే కేవలం ప్రీమియర్స్ ద్వారానే సైరా వన్ మిలియన్ మార్కు చేరుకునేలా కనబడుతుంది. మూవీకి మిక్స్ డ్ టాక్ రావ‌డంతో సినిమా వ‌సూళ్లు ఎలా ? ఉంటాయో చూడాలి.

మెగాస్టార్ చిరంజీవి త‌న కెరీర్లోనే తొలిసారి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడిగా న‌టించిన సినిమా కావ‌డంతో ఈ సినిమాలో చిరు న‌ట ఎలా ? ఉంటుందా ? అని అంద‌రూ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. సైరా సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా హీరో రామ్ చరణ్ నిర్మించారు. నయనతార, తమన్నా, అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, సుదీప్ కీలక పాత్రలు చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news