సంగీత దర్శకుడుగా పవన్ తనయుడు అకిరా ఎంట్రీ..

-

తెలుగు ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఇప్పటివరకు పెద్దగా మీడియా లో కనిపించకపోయినా మెగా కాంపౌండ్ లో అకిరా నందన్ గురించి నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ వారసుడుగా ఎప్పుడెప్పుడు వెండ తెర మీద చూసుకుందామని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తాడు అని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు అకిరా నందన్ షాక్ ఇచ్చాడని చెప్పాలి.

పవన్ కళ్యాణ్ తనయుడు గా అకిరానందన్ హీరోగా పరిచయం ఎప్పుడవుతాడు అంటూ ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు అకిరా నందన్ షాక్ ఇచ్చాడు. సంగీత దర్శకుడుగా మారిపోయి హీరోగా ఎంట్రీపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. ‘రైటర్స్‌ బ్లాక్‌’ అనే ఓ లఘు చిత్రానికి అకిరా సంగీతం అందిస్తున్నాడు. ఇదే విషయాన్ని నటుడు అడివి శేష్‌ వెల్లడించాడు. ‘రైటర్స్‌ బ్లాక్‌’ షార్ట్‌ ఫిల్మ్ లింక్‌ను ట్విటర్‌లో షేర్‌ చేసి టీమ్‌కు అభినందనలు చెప్పారు.

తనకెంతో ఇష్టమైన అకీర ఈ సినిమాకు మ్యూజిక్‌ అందించాడని వెల్లడించాడు. ఒక రచయిత.. కథను రాయడంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాడు అనే కథాంశంతో ఈ లఘు చిత్రం రూపుదిద్దుకుంది. ఇంగ్లీష్‌లో తెరకెక్కిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వం వహించగా… మనోజ్‌ నటించాడు. ఫణి మాధవ్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు అకీరా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. నాలుగున్నర నిమిషాల నిడివి గల ఈ ఫిల్మ్‌కు అకిరా అందించిన మ్యూజిక్‌ ఆకట్టుకునేలా ఉందని.. అకీరాకు మ్యూజిక్‌ అంటే ఎంతో ఆసక్తి అంటూ అడవి శేషు తెలిపారు. అతడు ప్రత్యేకంగా పియానో ప్లే చేయడం నేర్చుకున్నాడు. గతంలో తన స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘దోస్తీ’ పాటను పియానోపై ప్లే చేసి.. అందరి దృష్టిని ఆకర్షించాడు.

Read more RELATED
Recommended to you

Latest news