ఇంటి గుమ్మానికి గుర్రపు నాడ కడితే మంచిదని అనుకుంటున్నారా..?

-

ఇళ్లు అంటే.. ఆనందం, ఆరోగ్యం.. ఇళ్లు శుభ్రంగా ఎలాంటి దోషం లేకుండా ఉంటే..ఇంట్లో మనుషులు కూడా అంతే ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. వాస్తు నియమాలను ఎవరైనా నమ్ముతారు.. కానీ అవి ఏంటి అని చాలా మందికి తెలియదు. దిష్టి తగలకుండా ఇంటి ముందు ఏవేవో కడతారు.. అసలు ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఏం వస్తువులు ఉంటాలి, ఏం ఉంచకూడదో మీకు తెలుసా..? చాలామంది కామన్‌గా చేసే తప్పు.. గుర్రపునాడ ఇంటి గుమ్మానికి కడితే మంచిదని అనుకోవడం..ఇలా చెయ్యడం వల్ల తెలియకుండానే చిక్కుల్లో పడుతుంటారు. ఇది ప్రధానంగా శాస్త్రం తెలియకపోవడం వల్ల కలిగే పరిస్థితి.

చాలామంది అందవిహీనంగా కనిపించే వస్తువులను దిష్టికి విరుగుడుగా ఇంటి బయట పెడుతుంటారు. ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని చాలా మంది ఇంటిబయట రాక్షసుడి ముఖం పటాన్ని పెడుతుంటారు. కొంత మంది పాత చెప్పులు, చీపుర్లు, టైర్లు ఇలా కొన్ని వస్తువులను ఉంచుతుంటారు. అవి ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతాయని భావిస్తారు. కానీ ఇవి ఇంటి బయట ఉంచడం అంత మంచిది కాదని వాస్తు చెబుతోంది. ఇవి ఇంట్లో నివిసించేవారికి దురదృష్టాన్ని తెస్తాయి.

గుర్రపు నాడ

కొంత మంది ఇంటి బయట గుర్రపు నాడ పెట్టుకుంటారు. ఇది నెగెటివ్ ఎనర్జీని అడ్డుకుంటుందని అనుకుంటారు..కానీ జ్యోతిష్యంలో గానీ, వాస్తులో గానీ.. దీని గురించి ఎక్కడా వివరించలేదు. అంతేకాదు వాస్తు ప్రకారం.. గుర్రపు నాడ అశుభం అని కూడా చెబుతోంది. ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చేరకుండా నివారించేందుకు ఇంటి బయట గణపతి విగ్రహాన్ని పెట్టాలి. గుమ్మం దగ్గర కూర్చిని ఉండే గణపతి శుభ్రప్రదమని శాస్త్రం చెబుతోంది. ప్రతి నెలలో వచ్చే రెండు చతుర్థి రోజుల్లోనూ, ప్రతీ బుధవారం గణపతి పూజ చేసుకోవడం శ్రేష్ఠం. ఇంటికి ఇది శుభప్రదం.

మొక్కలు వద్దు..

ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర మొక్కలు పెట్టకుంటే అందంగా ఉంటుంది అనుకుంటారు.. అది అంత మంచిది కాదట. ఇలా ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర మొక్కలు ఉంటే వృత్తిలో ఆటంకాలు ఎదురవుతాయట. అంతేకాదు ఇది పిల్లల ఎదుగుదల మీద కూడా ప్రభావం చూపిస్తుంది..ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మొక్కలు లేదా చెట్లు ఉండకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు.

ఇంటి ప్రవేశ ద్వారం లేదా వాకిలి ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోకి ప్రవేశించే మురికి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది.. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర లేదా ఎదురుగా గొయ్యి లేకుండా చూసుకోండి… పొరపాటున ఏర్పడినా కూడా దాన్ని వెంటనే చదును చేసుకోవాలి. సూర్యోదయానికి ముందే ఇంటి వాకిలి చిమ్మి ముగ్గులు పెట్టుకుంటే ఆ ఇంట్లోకి సంధ్యా లక్ష్మీ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవేశిస్తుందని పండితులు అంటున్నారు.. అలాగే సాయంత్రం కూడా తప్పకుండా ఇంటి వాకిలి చిమ్మి శుభ్రంగా ఉంచుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news