పిల్లలు మానసికంగా మరియు శారీరకంగా పెరగడానికి ఈరోజుల్లో మార్కెట్ లో చాలా రకాల ప్రోటీన్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఇండియా ఆరోగ్య భద్రత ప్రమాణాలకు లోబడి తయారవుతూ ఉంటాయి. మరియు ఈ ప్రోడక్ట్ లలో ఏ ఏ పదార్ధాలను వాడారో కచ్చితంగా ఆ ప్యాకెట్ పైన ముద్రించి ఉంటారు. కాగా కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక విషయం ఎందరినో ఇబ్బందిపడేలా చేస్తోంది. పిల్లలు వాడే బోర్నవిటా లో ఎక్కువ షుగర్ సంబంధిత పదార్ధం మరియు క్యాన్సర్ ను కలుగచేసే రంగులు ఉన్నాయని ఈ విషయం సారాంశం. అయితే దీనికి స్పందించిన బోర్నవీటా సంస్థ… గత 70 సంవత్సరాలుగా మా కంపెనీ భారత ప్రజల అభిమానాన్ని పొందగలిగాము.
భారత్ లో ఉన్న చట్టాలను గౌరవిస్తూ మరియు నాణ్యత ప్రమాణాలను ఎక్కడా దాటివేయకుండా… పోషకాహార నిపుణుల నియంత్రణలో ఈ ప్రోడక్ట్ ను తయారు చేస్తున్నాము. అంతే కాకుండా ఈ ప్రోడక్ట్ లో ఏ ఏ పదార్ధాలు వాడుతున్నాము అన్నది క్లియర్ గా ప్యాకెట్ పై ఉన్నాయి. ఈ ఫేక్ న్యూస్ ను నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చింది.