సైరా, వార్ సినిమాల‌కు చుక్క‌లు చూపించిన జోక‌ర్‌

-

రెండు రోజుల క్రితం మూడు భారీ చిత్రాలు గాంధీ జయంతి సందర్బంగా విడుదల అయ్యాయి. ఈ మూడు సినిమాల్లో తెలుగు మెగాస్టార్ చిరంజీవి న‌టించిన పీరియాడిక‌ల్ మూవీ సైరా న‌ర‌సింహారెడ్డి. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా రు. 280 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది. ఇక అదే రోజు బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోష‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్‌ల మ‌ల్టీస్టార‌ర్ వార్ కూడా రిలీజ్ అయ్యింది.

ఇక ఈ రెండు సినిమాల‌తో పాటు హాలీవుడ్ డ‌బ్బింగ్ మూవీ జోక‌ర్ కూడా వ‌చ్చింది. ఈ మూడు చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. సైరా, వార్ మరియు జోకర్ చిత్రాలకు పాజిటివ్ రివ్యూ రాడంతో పాటు, వర్డ్ అఫ్ మౌత్ బాగుండటంతో ఈ మూడు చిత్రాల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. జోక‌ర్ విదేశీ సినిమా కాగా… సైరా, వార్ ఇండియ‌న్ సినిమాలు అయితే చెన్నై సిటీలో ఇండియ‌న్ సినిమాల‌ను బీట్ చేసి మ‌రీ జోక‌ర్ ఎక్కువ వ‌సూళ్లు సాధించింది.

ఇది మ‌న సినిమాల‌కు మామూలు షాక్ కాదు. రెండవ రోజు చెన్నై నగరంలో జోకర్ చిత్రం 19లక్షల వసూళ్లు సాధించగా, సైరా మరియు వార్ చిత్రాలు సరిసమానంగా 14లక్షల వసూళ్లు రాబట్టాయని సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా జోకర్ మొదటిరోజు 5.4 మిలియన్ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది.

ఇక బాలీవుడ్‌లోనూ జోక‌ర్ రెండు రోజుల‌కు రు.10 కోట్ల‌ను క్రాస్ చేసింది. అదే భారీ బడ్జెట్‌తో తెరకెక్కి… బాలీవుడ్‌లో భారీ ఎత్తున ప్ర‌మోష‌న్లు చేసిన మెగాస్టార్ సైరాకు అక్క‌డ అదిరిపోయే షాక్ త‌గిలింది. తొలి రోజే ఆ సినిమా కేవ‌లం రు.2 కోట్ల‌తో స‌రిపెట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news