అవినాష్ అరెస్ట్‌పై ట్విస్ట్‌లు..సుప్రీంలో నెక్స్ట్ ఏంటి?

-

వైస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో జగన్ మరో బాబాయ్ వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆయన తనయుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఈ కేసులో ఉన్నారని సి‌బి‌ఐ వాదిస్తుంది. అయితే ఆయనని అదుపులోకి తీసుకోవాలని చూసింది గాని..తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయడం, దాన్ని విచారించిన హైకోర్టు..ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దని, అలాగే ప్రతిరోజూ విచారణ చేయాలని తీర్పు ఇచ్చింది.

ఇక ఈ తీర్పుని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది.  ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సోమవారం అన్ని విషయాలు పరిశీలిస్తామని,  హైకోర్ట్ తీర్పు చాలా దారుణమని, ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది.

ఇక వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. సీబీఐపై ఎటువంటి ఆంక్షలూ లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆయన కుమార్తె సునీతారెడ్డి పిటిషన్‌ దాఖలు చేయడం, హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించడంతో..నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. సుప్రీం ఎలాంటి తీర్పు ఇస్తుందా? అని అటు వైసీపీ, ఇటు టి‌డి‌పి శ్రేణులు చూస్తున్నాయి.

అయితే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వకపోయినా…వివేకా కేసులో వైసీపీకి జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయిందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే గత ఎన్నికల ముందు ఈ కేసుని అడ్డం పెట్టుకుని, చంద్రబాబుపై ఆరోపణలు చేసి..వైసీపీ రాజకీయంగా లబ్ది పొందింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి వివేకా కేసు వైసీపీకే రివర్స్ అవుతుందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news