తాడేపల్లి: టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. నిన్న చంద్రబాబు చేసుకున్నది 420 బర్త్డే అని అన్నారు. చంద్రబాబు మళ్ళీ పేదలను మోసం చేసే కార్యక్రమం చేపట్టాడని.. తానే ఇంద్రుడు, చంద్రుడు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు.
ఆయన ప్రజల్లో నుండి వచ్చిన వ్యక్తి కాదన్నారు మంత్రి కారుమూరి. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి, పార్టీ, బ్యాక్ బాలన్స్ లాక్కొని అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు. 600 వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిన నయవంచకుడు, గుంట నక్క చంద్రబాబు అని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తెస్తే చంద్రబాబు అడ్డుకున్నాడని మండిపడ్డారు. తొడ పుట్టిన వాడిని గదిలో బంధించిన వ్యక్తి చంద్రబాబు ఓ సైకో, శాడిస్ట్ అంటూ విమర్శించారు.
చంద్రబాబు కన్నతల్లికి కూడా తలకొరివి పెట్టని వ్యక్తి అని అన్నారు. చంద్రబాబు అక్రమాలు బయటికి వస్తున్నాయని.. త్వరలోనే ఆయన జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు. హత్య రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు మంత్రి కారుమూరి. రంగా హత్య ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలుసన్నారు.