ట్విట్టర్లో బ్లూ టిక్స్ కోల్పోయిన మన సెలబ్రెటీలు వేరే!

-

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తాజాగా కొందరు సెలబ్రిటీల బ్లూ టిక్స్ తొలగించింది. ఈనెల 20వ తారీకు నుంచి చాలామంది సెలబ్రిటీల బ్లూ టిక్స్ ట్విట్టర్లో కనిపించడం మానేశాయి. అయితే ఇందులో ఉన్న మన సెలబ్రిటీలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం.

ట్విట్టర్లో సెలబ్రిటీల అఫీషియల్ ఎకౌంటును కనిపెట్టాలంటే బ్లూటూత్ ని ఉపయోగిస్తారు. ఆ బ్లూటూత్ చూడగానే వాళ్ళ అఫీషియల్ ఖాతా అని డిసైడ్ అయిపోతారు. అయితే ఇప్పటి నుంచి చాలామంది సెలబ్రిటీల బ్లూటూత్ కనిపించవు. ఇందులో ఎవరెవరు ఉన్నారు అంటే..

టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య, అఖిల్ అక్కినేని, నితిన్, ప్రకాశ్ రాజ్, పూజా హెగ్డే, కీర్తి సురేష్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి, మంచు మనోజ్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు బ్లూ టిక్ కోల్పోయారు. అయితే విచిత్రంగా జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు అక్కినేని నాగార్జున మంచి విష్ణు వంటి వారి ఎకౌంట్లకు బ్లూ టిక్స్ మాత్రం కనిపిస్తున్నాయి..

బాలీవుడ్ నుంచి బాద్షా షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ బిగ్బి అమితాబ్ బచ్చన్ అలియా భట్ ప్రియాంక చోప్రా దీపిక పదుకొనే వంటి వారి ట్విట్టర్ అకౌంట్లకు ఇకపై బ్లూటిక్స్ కనిపించే అవకాశం లేనట్టు తెలుస్తుంది.

కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ విజయ్ షింబు వంటి సెలబ్రిటీలు సైతం బ్లూ టిక్స్ కోల్పోయారు. ఇండియన్ క్రికెట్ టీం నుంచి విరాట్ కోహ్లీ ఈరోజు శర్మ ఎకౌంట్లకు బ్లూ టిక్స్ కనిపించకుండా పోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news