డబ్బులని అతిగా ఖర్చు చేస్తున్నారా..? ఇలా చేస్తే ఆదా చేసుకోవచ్చు..!

-

చాలామంది తెలియకుండా డబ్బులుని విపరీతంగా ఖర్చు చేస్తూ వుంటారు. నిజానికి ఒకసారి ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ వాటిని మనం సంపాదించాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. పైగా డబ్బులను విపరీతంగా ఖర్చు చేసిన తర్వాత ఖర్చుల కోసం కూడా డబ్బులు మిగలవు ఒకసారి శాలరీ రాగానే దానిని ప్లాన్ చేసుకోవాలి. దేనికోసం ఎంత ఖర్చు చేయాలి మన ఖర్చులు ఏంటి.. ఏవి ముఖ్యమైనవి ఇటువంటివన్నీ కూడా మీరు చూసుకుని డబ్బులని ఖర్చు చేయాల్సి ఉంటుంది. చాలామంది డబ్బులని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటారు. చేతిలో ఉన్నప్పుడు డబ్బుల్ని వదిలేసుకుని తర్వాత నిరాశ చెందుతూ ఉంటారు.

డబ్బులని అవసరానికి ఖర్చు చేయాలి. మీరు కూడా అధిక ఖర్చు పెడుతున్నారా నియంత్రణలో ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా… అయితే కచ్చితంగా మీరు వీటిని పాటించండి మీరు మీ ఆర్థిక స్థితిని నియంత్రించుకోవడానికి మీ ఆదాయం ఖర్చులపై మీకు అవగాహన ఉండాలి. అప్పు ఆదాయ నిష్పత్తిని అర్థం చేసుకోవాలి. అదే విధంగా మీ ఖర్చులను మీరు అంచనా వేసుకోండి. ఆ తర్వాత మీరు ఆర్థిక లక్ష్యాలని సాధించేందుకు ఒక ప్రణాళికని స్టార్ట్ చేయండి. ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించడం అనేది సామాన్యులకు వ్యక్తిగత ఫైనాన్స్ పై పట్టు సాధించడానికి ఫస్ట్ స్టెప్.

మీరు మీ డబ్బుని ఆదా చేసుకోవాలంటే లోన్లు ఏమైనా ఉంటే టైం కి కట్టేసుకోండి ఇంటిపై డౌన్ పేమెంట్ కోసం ఆదా చేయండి పదవీ విరమణ కోసం ప్లాన్ చేసుకోండి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. అలానే మొదట మీ ఖర్చులన్నీ తీసేసి ఎంత మిగిలిందో చూసుకొని ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారు అనేది పక్కన పెట్టేయండి ఇలా ఒకసారి డబ్బుని పక్కన పెట్టేస్తే కచ్చితంగా వాటిని మీరు సేవింగ్స్ కోసం ఉంచుకోవచ్చు. చాలామందికి ఈ విషయంపై స్పష్టత ఉండదు.

డబ్బులు ఆదా చేసుకోవడం కోసం ముందు మీ బడ్జెట్ ని రూపొందించుకోండి అలానే ఖర్చులను తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం. బయట ఆహారం తీసుకోవడం వినోదం షాపింగ్ ఇటువంటి కోసం ఖర్చుల్ని తగ్గించండి. ప్రతిరోజు సినిమాకి వెళ్లిపోవడం వంటివి చేయకండి వీలైనంత వరకు ఇంట్లో సినిమాలు చూడడం అనవసరమైన షాపింగ్ కంటే అవసరమైన వాటిని కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా అవసరం. అలానే సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించాలి భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టండి. క్రెడిట్ స్కోర్ ని పర్యవేక్షించాలి క్రెడిట్ వినియోగాన్ని తక్కువగా ఉంచడం, క్రెడిట్ నివేదికలో తప్పులు చేయకుండా ఉండడం ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news