IPL 2023 : SRH ప్లేయర్‌ తో జడేజా గొడవ..వీడియో వైరల్‌

-

IPL 2023లో మ్యాచ్‌ లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రోజున సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్‌ అద్భుత విజయం సాధించింది.

అయితే, నిన్నటి మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ కీపర్ క్లాసెన్ తో సిఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కు వాగ్వాదం జరిగింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో జడేజా వేసిన తొలి బంతిని మయాంక్ స్ట్రైట్ గా ఆడారు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న క్లాసెన్ అడ్డు రావడంతో జడేజా క్యాచ్ పట్టలేక కింద పడిపోయారు. దీంతో జడేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత బంతికి కూడా ఇద్దరు కోపంగా చూసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news