జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపి నేత ఈటెల రాజేందర్ ఎలాంటి ఆధారాలు లేకుండా అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్.. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి 25 లక్షలు ఇవ్వడం జరిగిందని పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని నిలువరించే విధంగా ప్రతిపక్ష పార్టీ ఓట్లను చిల్చి లబ్ది పొందేందుకు ఒక కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు జీవన్ రెడ్డి. కవిత లిక్కర్ కేస్ ఓ టివి సీరియల్ లా ఉందన్నారు జీవన్ రెడ్డి. జైల్ నుండి కవిత కు 15 కోట్లు ఇచానని చెప్తున్నా సీబీఐ ఎందుకు విచారణ చేయట్లేదని ప్రశ్నించారు.
ప్రతిపక్ష పార్టీల ఎన్నికల ఖర్చు బరిస్తానని చెప్పిన రాజ్ దీప్ సర్దేశాయ్ ను ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం, భగీరథ, యాదద్రి ప్రాజెక్ట్ ల మీద ఎందుకు విచారణ చేయట్లేదన్నారు జీవన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో పుట్ట బోయేబిడ్డ లక్ష ఇరవై ఐదు వేల రూపాయల అప్పుతో పడుతున్నాడని తెలిపారు జీవన్ రెడ్డి. అధికారం లోకి రాక ముందు కల్వకుంట్ల కుటుంబం అప్పటి ఆస్తులు ఎన్ని ఉన్నాయి.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చెప్పాలన్నారు. వీరిపై ఎందుకు విచారణ చేయట్లేదని నిలదీశారు జీవన్ రెడ్డి.