నెలలు నిండాక గర్భిణులు నెయ్యి తినడం మంచిదేనా..? శాస్త్రవేత్తలు ఏం అంటున్నారు..

-

నెయ్యి గురించి మీరు ఇప్పటి వరకూ పాజిటివ్‌ టాక్‌ మాత్రమే విని ఉంటారు. నెయ్యిలో ఇన్ని పోషకాలు ఉన్నాయి, ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి ఇలా.. అవును నిజమే… నెయ్యి ఆరోగ్యానికి మంచిదే.. ఎంత మంచి ఆహారం అయినా.. ఒక గర్భిణీకి ఇచ్చే ముందు ఆ ఇంట్లో వాళ్లు చాలా సార్లు
ఆలోచిస్తారు. అప్పటి వరకూ మనం అది బానే తిని ఉంటాం.. కానీ ప్రెగెన్సీ కన్ఫామ్‌కాగానే.. ఇది తినొచ్చా, తినకూడదా అని ఒకటే టెన్షన్.. ఏది పడితే అది తింటే.. తల్లితో పాటు బిడ్డకు కూడా ప్రమాదం.. అయితే ఈ సమయంలో నెలలు నిండాక నెయ్యి తినొచ్చా లేదా అనే డౌట్‌ చాలామందికి ఉంటుంది.. నెయ్యి తింటే సుఖప్రసవం అవుతుందని కొంతమంది అంటారు. కాదు నెలలు నిండాక నెయ్యి తినడం ఆపేయాలని ఇంకొంత మంది అంటారు.. ఈ రెండింటిలో ఏది నిజం..?

నెయ్యిని ఒక ఆహార పదార్ధంగా చూస్తే అందులో బోలెడు పోషకాలు ఉన్నాయి.. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే గర్భం చివరి నెలల్లో నెయ్యి తినడం వల్ల సాధారణ ప్రసవం అవుతుందని ఎక్కడా శాస్త్రీయంగా ఆధారాలు లేవు..పెద్దలు భావిస్తున్న ప్రకారం నెయ్యి తినడం వల్ల డెలివరీ సమయంలో సాధారణ పద్ధతిలో బిడ్డ సులభంగా బయటికి జారిపోవడానికి సహాయపడుతుందని అంటారు. ఇది నిజమని ఎక్కడా ఏ అధ్యయనమూ నిరూపించలేదు. అయితే నెయ్యి తినడం వల్ల మాత్రం చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి.

శతాబ్ధాలుగా సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో నెయ్యిని వాడుతున్నారు.. గర్భిణులతో సహా అందరూ నెయ్యి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు..అయితే అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. రోజుకో స్పూన్ నెయ్యి తింటే చాలు, అందులోని ఆరోగ్య లాభాలు శరీరానికి అందుతాయి.

నెయ్యిలో విటమిన్లు ఏ, డీ, ఈ, కే ఉన్నాయి. ఇది గర్భధారణ సమయంలో పిండానికి మేలు చేస్తుంది… నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. తక్షణమే శక్తిని అందిస్తాయి. గర్భస్థ శిశువు మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఇవి తోడ్పడుతాయి. కాబట్టి గర్భిణీలు నెయ్యిని తినడం మంచిది.

నెయ్యి శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను సరిచేస్తుంది. గర్భధారణ సమయంలో హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వాటిని సరి చేయడంలో నెయ్యిలోని పోషకాలు సహాయపడతాయి. ఆరోగ్యకరమైన హార్మోన్ల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. ఎండోక్రైన్ వ్యవస్థను నియంత్రించడంలో సహాయపడతాయి.

ఆయుర్వేదంలో నెయ్యిని జీర్ణశక్తిని పెంచేదిగా చెబుతారు. జీర్ణాశయ అగ్నిని ఉత్తేజపరిచి జీవక్రియ ఆరోగ్యకరంగా జరిగేలా చేస్తుంది. గర్భధారణ సమయంలో నెయ్యిని తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు రావు.

పిల్లలకు నెయ్యిని రోజూ తినిపించడం వల్ల వారిలో తెలివి తేటలు పెరుగుతాయి. ఆహారం తినాలన్న ఆసక్తి కూడా పెరుగుతుందట.. ఎదిగే పిల్లలకు నెయ్యి చాలా మంచిది..

అయితే కొంతమంది మొదటి నుంచే నెయ్యి అంటే ఇష్టం ఉండదు..కొన్నిసార్లు అది అలెర్జీకి కూడా దారితీస్తుంది. అలాంటి వాళ్లు నెయ్యి తినకపోవడమే మంచిది.. ఆరోగ్యానికి మంచిది కదా అని బలవంతంగా తింటే లేనిపోని సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news