వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని జనసేన పార్టీ కీలక నేత నాగబాబు అన్నారు. జనసేనలో వరుస వర్చువల్ సమావేశాలు జరుగుతున్నాయి. మూడు రోజులుగా వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తోన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. వివిధ నియోజకవర్గాల నేతలతో వర్చువల్ కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్న నాగబాబు… పార్టీ బలోపేతం.. నేతల మధ్యనున్న గ్యాప్.. స్థానికంగా ఉన్న సమస్యలపై వర్చువల్ సమావేశాల్లో చర్చ నిర్వహించారు.
ఇక భీమిలీ నియోజకవర్గం జనసేన కార్యవర్గంతో తాజాగా నాగబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు మాట్లాడుతూ, విభజిస్తూ విద్వేషాలు రెచ్చగొట్టే వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. విభజించు-పాలించు అనే సూత్రంతో జగన్ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. విధ్వంసకర పాలన ఏపీలో ఉందని మండిపడ్డారు నాగబాబు.