మే 9న జగనన్నకు చెబుదాం ప్రారంభమౌవుతుందన్నారు సీఎం జగన్. దీని కోసం 1902 హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేస్తున్నామని.. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వివరించారు జగన్. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశామని.. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి నా పేరును కలిపారని వెల్లడించారు.
అంటే ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంతో ఇట్టే అర్థం అవుతుందన్నారు. స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదామని.. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదామని పేర్కొన్నారు. ఇండివిడ్యువల్ గ్రీవెన్సెస్‌ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే దీని ఉద్దేశమన్నారు. హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తే.. దాని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలని.. సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్ యూనిట్లు ఉంటాయని వివరించారు సీఎం జగన్.