ఐపిఎల్ 2023: రహ్మానుల్లా గుర్బాజ్ వీరవిహారం .

-

 

కోల్కతా నైట్ రైడర్స్ మరియు గుజరాత్ టైటాన్స్ ల మధ్యన నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కొలకతా కు ఆరంభం నుండి సరైన విధంగా పరుగులు రాలేదు. ఈ మ్యాచ్ లో జాసన్ రాయ్ కు బదులుగా మళ్లీ ఆఫ్ఘన్ చిచ్చర పిడుగు గుర్భాజ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా గుర్బాజ్ మాత్రం అద్భుతంగా ఆడి జట్టును ఒక సురక్షితమైన స్కోర్ ను అందించాడు అని చెప్పాలి.

ఈ మ్యాచ్ లో జగదీశన్ , థాకూర్ , వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా లు సక్సెస్ ఫుల్ గా విఫలం అయ్యారు, ఈ దశలో కోల్కతా ఇన్నింగ్స్ మరీ దారుణమైన స్కోర్ ను చేస్తుంది అని అంతా అనుకున్నారు. గూర్బాజ్ మాత్రం కేవలం 30 బంతుల్లో 81 పరుగులు చేసి కోల్కతా ఒక ఘనమైన స్కోర్ చేయడానికి పునాదులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 5 ఫోర్లు మరియు 7 సిక్సులు ఉన్నాయి. మరి కోల్కతా ఏ మాత్రం స్కోర్ చెదిస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news