వరంగల్ జిల్లా: మేడేను పురస్కరించుకొని మావోయిస్టు రాష్ట్ర కమిటీ లేఖ విడుదల చేసింది. సామ్రాజ్యవాదాన్ని కూల్చి సోషలిజాన్ని నిర్మిద్దామని లేఖలో పిలుపునిచ్చారు మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్. విప్లవ కార్మిక వర్గం నాయకత్వం వహించాలని లేఖలో కోరారు మావోలు. సోషలిస్టు విప్లవ స్పూర్తితో మేడే వేడుకలు జరపాలని లేఖలో పేర్కొన్నారు అధికార ప్రతినిధి జగన్. తెలంగాణలో బిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయం దారుణంగా దిగజారిందన్నారు.
చిన్న మధ్యతరగతి రైతులు, వలస కూలీలుగా మారుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో నిరుద్యోగులు 30 లక్షలకు పెరిగారని.. 9 ఏండ్లలో 70 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయన్నారు. విద్యుత్ సంస్థల్లోని 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. భారీ ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీలను అడవుల నుండి తరిమేస్తున్నరని.. సోషలిజం స్థాపనకు మిలిటెంట్ ఉద్యమాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.