తెలంగాణా సంస్క్రతికి వ్యతిరేకంగా సచివాలయం నిర్మాణం – బండి సంజయ్ సంచలనం

-

తెలంగాణ నూతన సచివాలయం ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ నూతన సచివాలయం పై సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణా సంస్క్రతికి వ్యతిరేకంగా సచివాలయం నిర్మించారని అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయంలో మార్పులు చేస్తామన్నారు. నూతన సచివాలయ ప్రారంభానికి ఆహ్వానం అందినా కూడా వెళ్ళనని అన్నారు బండి సంజయ్.

హిందూవుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన సెక్రటేరియట్ లోకి అడుగు పెట్టానన్నారు. సచివాలయం నిర్మాణంలో హిందూవుల వాటా రెండు గుంటలు మాత్రమేనన్నారు. ఇక కర్నాటకను కాంగ్రెస్ పార్టీ ఏటిఎం గా వాడుకుంటుందని ఆరోపించారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ లేదన్నారు బండి సంజయ్. వచ్చే ఎన్నికలలో బిజెపి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని.. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవరినీ సిఎం చేసేదీ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news