హైదరాబాద్ లో భారీ వర్షం..టాల్‌ ఫ్రీ నంబర్‌ తో కంట్రోల్ రూం ఏర్పాటు

-

హైదరాబాద్  నగరాన్ని వర్షాలు వదలడం లేదు. నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ నగరాన్ని మరోసారి భారీ వర్షం అతలాకుతలం చేసింది.  గోల్నాక, యూసఫ్ గూడ, లక్డీకపూల్, వనస్థలిపురం, మల్లాపూర్, మాదాపూర్, కూకట్ పల్లి, విద్యానగర్, ఎల్బీనగర్, కాచిగూడ, అమీర్పేట, బోరబండ, గచ్చిబౌలి, అంబర్పేట, రాయదుర్గం, హబ్సిగూడ, తార్నాక, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

వర్షానికి ఈదురు గాలులు కూడా తోడయ్యాయి. దాంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. భారీవర్షం ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. కాగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి స్పష్టం చేసింది. ఈ మేరకు 040 211 11111 ఫోన్ నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

కాగా, తెలంగాణలో రానున్న ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, బొంబాయి, గద్వాల జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news