తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై మావోయిస్ట్ నేత జగన్ లేఖ

-

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆ ప్రభావం సాధారణ ప్రయాణికులతో పాటు దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారిపైనా తీవ్రంగా పడుతుంది. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని మొత్తం 26 డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఇదిలా ఉండ‌గా ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్లే నష్టాల్లో ఉందని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం కోసమే ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మె విరమించొద్దని విజ్ఞప్తి చేశారు. డిమాండ్ల సాధనకు కార్మికులు మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news