పోకిరి 2006లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇది బాక్సాఫీసు వద్ద ఒక నూతన ఒవరడిని సృస్టించింది. మగధీర చిత్రం విడుదలవరకు ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోఅత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. అయితే ఇప్పుడు పోకిరి 2 స్టార్ట్ అవ్వబోతుందని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ చేయబోయ్యే సినిమా ఇదే అంటున్నారు. పోకిరిని మించిన స్టోరీ పూరీ రెడీ చేసాడు. ఇక ప్రస్తుతం పూరీ.. విజయ్ దేవరకొండ, బాలయ్యలతో సినిమాలు చేసిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుందంటున్నారు.
అయితే ఇంత పవర్ పుల్ సబ్జెక్ట్ కు హీరో ఎవరు? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మరింది. అయితే పోకిరి 2 కి మెగ పవర్ స్టార్ రాంచరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. చిరుత తర్వాత రాంచరణ్ మళ్ళీ పూరీ కలసి చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ రాంచరణ్- పూరీ కలిస్తే పోకిరి 2 మరో ఇండస్ట్రీ హిట్ అవ్వటం ఖాయం అంటున్నారు.