Vande Bharat : కేరళలో వందేభారత్ రైలుపై రాళ్లదాడి

-

ఈ మధ్య తరచూ వందేభారత్ రైళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ ఘటనలపై స్పందించిన అధికారులు ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా ఈ దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా కేర‌ళ‌లో కొత్త‌గా ప్రారంభించిన వందే భార‌త్ రైలుపై రాళ్ల దాడి జ‌రిగింది. దీంతో రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ మేర‌కు రైల్వే అధికారులు ధ్రువీక‌రించారు. కాస‌ర్‌గాడ్ నుంచి తిరువ‌నంత‌పురం రైలు వెళ్తుండ‌గా తిరున‌వ‌య – తిరూర్ మ‌ధ్య గుర్తు తెలియ‌ని దుండ‌గులు రాళ్ల దాడి చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం సెంట్ర‌ల్ రైల్వేస్టేష‌న్లో ఏప్రిల్ 25వ తేదీన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వందే భార‌త్ రైలును ప్రారంభించారు. అయితే ఈ రాళ్ల దాడిలో ప్ర‌యాణికుల‌కు ఎవ‌రికీ గాయాలు కాలేద‌ని పోలీసులు తెలిపారు. ఒక కోచ్ పూర్తిగా డ్యామేజ్ అయింద‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వందే భార‌త్ రైళ్ల‌తో పాటు మిగ‌తా రైళ్ల‌కు కూడా భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేస్తామ‌ని రైల్వే అధికారులు స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news