BREAKING : కళామందిర్ లో ఐటీ సోదాలు..!

-

BREAKING : హైదరాబాద్ నగరంలోని కళామందిర్ లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వైజాగ్ చెందిన కళామందిర్ వస్త్ర వ్యాపారుల సంబంధించిన ఇళ్లల్లో ఐటీ సోదాలు చేస్తున్నారు.

హైదరాబాద్ మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. వైజాగ్ కేంద్రంగా వస్త్ర వ్యాపారాలు నిర్వహిస్తున్న బిజినెస్మేన్ ఇండ్లలో సోదాలు జరుగుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలిలో సోదాలు చేస్తున్నారు. మొత్తం 40 బృందాలు 20 ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news