మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌

-

మణిపూర్‌లో నెలకొన్న శాంతిభద్రతల సమస్యతో అక్కడ ఉన్న తెలంగాణ విద్యార్థులు, నివసిస్తున్న ప్రజల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మణిపూర్ రాష్ట్రంలోని పరిస్థితిని పర్యవేక్షించడానికి, మణిపూర్‌లోని తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక సెల్ తెరిచారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్ మరియు పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారు. తెలంగాణ విద్యార్థులను ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు తక్షణమే ప్రత్యేక విమానంలో తరలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

India: 54 dead after ethnic clashes in northeastern Manipur

ఇందు కోసం ఆదివారం (07-05-2023) ఉదయం ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఇంఫాల్ నుండి హైదరాబాద్‌కు తెలంగాణ విద్యార్థులు సురక్షితంగా తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సంప్రదించి చర్యలు తీసుకుంటున్నారు. మణిపూర్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రజలు/విద్యార్థుల భద్రత కోసం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news