కర్నాటక ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపై విశ్వహిందూ పరిషత్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లీగల్ నోటీసులు పంపింది. మే 4న వీహెచ్‌పీ చండీగఢ్ యూనిట్ జారీ చేసిన నోటీసులో ఖర్గే తనపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రూ.100 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
14 రోజుల్లోగా పరిహారం చెల్లించాలని కోరుతూ వీహెచ్‌పీ చండీగఢ్ యూనిట్, దాని యువజన విభాగం బజరంగ్ దళ్ మే 4న నోటీసు జారీ చేసింది. ఈ నోటీసులకు కాంగ్రెస్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పీఎఫ్ఐ మాదిరి బజరంగ్ దళ్ న నిషేధిస్తామని చేసిన కాంగ్రెస్ ప్రకటనను బీజేపీ క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు విశ్వహిందూ పరిషత్ ఏకంగా పరువు నష్టం అంటూ లీగల్ నోటీసులు పంపించింది.