ఈ నెల 12 నుంచి ఏపీలో రాజ శ్యామల యాగం – కొట్టు సత్యనారాయణ

-

ఈ నెల 12 నుంచి ఏపీలో రాజ శ్యామల యాగం ఉంటుందని ప్రకటించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఈ నెల 12 నుంచి 17 వరకు బెజవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో రాజ్య శ్యామల, సుదర్శన యాగం జరుగుతుంది.. ఈ నెల12, 17 రెండు తేదీల్లో సీఎం జగన్ పాల్గొంటారని వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కళ్యాణం, సంక్షేమం కోసం యాగం చేస్తున్నామని.. యాగం మీద విమర్శలు చేస్తున్న రాక్షసులు వంటి ప్రతిపక్షాలు కూడా బాగుండాలి అని యాగం చేస్తున్నాన్నారు.

అటు విజయవాడ దుర్గ గుడి ఈవో, ట్రస్టు బోర్డు చైర్మన్ మధ్య వివాదం పై స్పందించారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. ఏసీబీ అధికారుల దాడులపై ఈవో పై విమర్శలు చేయడం తగదని.. కొంతమంది తమ ఇష్ట ప్రకారం పనులు కావడం లేదని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. మంత్రిని కాదని సీఎం కు ఈవో పై ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏంటి? అని నిలదీశారు. వివాదంపై విచారణ చేయాలని సీఎం ఆఫీస్ మళ్లీ నాకే పంపిస్తుంది… పాలకమండలి నియామకం జరిగి ఎంతో కాలం కాలేదన్నారు. గుడిపై మొత్తం మాదే పెత్తనం అనే భావనలో ఉన్నారు… ఇలాగే ఉంటే ఆలోచించాల్సి వస్తుందని వెల్లడించారు. అంతిమంగా ప్రభుత్వం చేసే నిర్ణయాలు కు ఎవరైనా కట్టుబడి ఉండాలి… అవినీతి అధికారుల విషయంలో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.

 

Read more RELATED
Recommended to you

Latest news