కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌..

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నరేంద్ర మోదీ ప్రభుత్వం దీపావళి కానుకగా గుడ్ న్యూస్ అందించింది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డియ‌ర్‌నెస్ అల‌వెన్స్‌(డీఏ)ను అయిదు శాతం పెంచారు. ఈ విష‌యాన్ని కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ బుధ‌వారం ప్ర‌క‌టించారు. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లించే 12 శాతంనుంచి 17శాతానికి పెరిగింది. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వానికి 16వేల కోట్ల రూపాయల భారం పడనుందని కేంద్రమంత్రి వెల్లడించారు.

పెంచిన డీఏను ఈ ఏడాది జూలై నుంచి అమలు చేయనున్నారు. దీంతో 50 లక్షలమంది ఉద్యోగులకు, 62 లక్షలమంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. అంతేకాదు ఆశా వర్కర్కకు కేంద్రం అందించే భత్యాన్ని రెట్టింపు చేస్తున్నట్టు కేంద్రమంత్రి ప్రకటించారు. ఇప్పటివరకు వెయ్యిరూపాయిలుగా ఉన్న ఈరెమ్యూనరేషన్‌ ప్రస్తుతం​ రూ. 2 వేలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news