ప్రియాంక మీటింగ్‌కు.. కోమటిరెడ్డి గైర్హాజరు.. కారణం అదేనా..

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్టరంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అగ్రనేతలతో డిక్లరేషన్లు ప్రకటిస్తు్న్నారు. అయితే.. గతంలో రాహుల్‌ గాంధీ వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ యువ సంఘర్షణ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ హాజరయ్యారు. అయితే.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Priyanka Gandhi : ప్రియాంకా గాంధీతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటి.. 40  నిమిషాలపైనే చర్చ..

టీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యువ సంఘర్షణ సభకు ప్రియాంక గాంధీ హజరుకాగా.. యువతే టార్గెట్‌గా కాంగ్రెస్ చేపట్టిన ఈ సభకు స్వయంగా ప్రియాంక గాంధీ హాజరుకావడంతో దాదాపు రాష్ట్రంలోని టీ- కాంగ్రెస్ నేతలు అంతా ఈ సభకు హాజరయ్యారు. అలాంటి ఈ సభకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గైర్హాజర్ అయ్యారు. అయితే, విదేశీ టూర్‌లో ఉండటంతోనే కోమటిరెడ్డి ఈ సభకు హాజరుకాలేదని సమాచారం. ప్రియాంక గాంధీ ఆఫీస్‌కు ఈ సమాచారం పంపించామని కోమటిరెడ్డి సిబ్బంది అంటున్నారు. అయినప్పటికీ కోమటిరెడ్డి తీరుపై మరోసారి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ సమావేశానికి ప్రియాంక గాంధీ హాజరవుతారని షెడ్యూల్ ముందే ఫిక్స్ అయినప్పటికీ కోమటిరెడ్డి మాత్రం విదేశీ టూర్‌కు వెళ్లడంపై కొందరు పెదవి విరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news