బర్గర్‌లో ఎలుక వ్యర్థాలు.. మెక్‌డొనాల్డ్స్‌ స్టోర్‌పై రూ. 5 కోట్లు ఫైన్‌ వేసిన కోర్టు

-

మెక్‌డొనాల్డ్స్‌: తినే ఆహారంలో బొద్దింకలు, బల్లులు కనిపించడం ఈరోజుల్లో అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.. వాటిని గుర్తించి షాప్‌ వాళ్లపై ఫైర్‌ అవ్వడం కేసులు పెట్టడం కూడా కామన్‌.. ఇక జరిమానాలు కూడా విధిస్తారు కానీ అవి పెద్దగా ఏం ఎక్కువ మొత్తంలో ఉండవు.. కానీ ఇక్కడ మెక్‌డొనాల్డ్ స్టోర్ మాత్రం తను చేసిన తప్పుకు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బర్గర్‌లో ఎలుక వ్యర్థాలు రావడంతో.. ఏకంగా రూ. 5 కోట్ల ఫైన్‌ వేశారు.

లండన్‌లోని ఓ మెక్‌డొనాల్డ్ స్టోర్‌కి కోర్టు రూ.5 కోట్ల జరిమానా విధించింది. చీజ్ బర్గర్‌లో ఎలుక వ్యర్థాలు కనిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ కస్టమర్ కంప్లెయింట్ చేశాడు. అధికారులు వచ్చి తనిఖీలు చేశారు. ఏ మాత్రం శుభ్రత పాటించడం లేదని గుర్తించి భారీ ఫైన్ వేశారు. కార్‌లో సరదాగా ట్రిప్‌కి వెళ్తున్న ఓ వ్యక్తి మధ్యలో మెక్‌డొనాల్డ్ స్టోర్ దగ్గర ఆగాడు. చీజ్ బర్గర్ ఆర్డర్ చేశాడు. రాపర్ ఓపెన్ చేసి తినబోతుండగా కంపు కొట్టింది.. వెంటనే పూర్తిగా తెరిచి చూశాడు. అందులో ఎలుక వ్యర్థాలు కనిపించాయి. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ఆ కస్టమర్ హెల్త్ అఫీషియల్స్‌కి కంప్లెయింట్ చేశాడు.

 

ఈ ఫిర్యాదు మేరకు అధికారులు ఆ స్టోర్‌కి వచ్చారు. స్టోర్‌ మొత్తం పరిశీలించారు. ఏ మాత్రం నీట్‌నెస్ లేకుండా దారుణంగా మెయింటేన్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఒక్క బర్గర్‌లోనే కాదు. స్టోర్ మొత్తం ఎలుక వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ ఉన్నాయి. ఫుడ్ ప్రిపేర్ చేసే చోటా ఇంతే అధ్వానంగా ఉంది. ఇక స్టాఫ్‌ కూడా ఏ మాత్రం శుభ్రత లేకుండా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్టు గుర్తించారు. మొత్తానికి ఈ అంశం కోర్టు వరకూ వెళ్లింది. స్టోర్ యాజమాన్యంపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ జరిపిన కోర్టు మెక్‌డొనాల్డ్‌కి రూ.5 కోట్ల జరిమానా విధించింది.

అందుకే బయటి ఫుడ్స్ తినొద్దని వైద్యులు మొత్తుకునేది.. మీరు లొట్టలేసుకుంటూ తినే ఆహారాలు ఎలా తయారు చేస్తారో ఒక్కసారి ఆ రెస్టారెంట్‌ కిచెన్‌లోకి వెళ్లి చూడండి.. కడుపులో తిప్పుతుంది. దీన్నా మీరు ఇంత ఖర్చుపెట్టి తింటున్నారు అనుకుంటారు..! ఇలాంటి ఆహారాలు తినడం ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి..!

Read more RELATED
Recommended to you

Latest news