క్యాన్సర్: ఈరోజుల్లో రకరకాల క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా స్కిన్ క్యాన్సర్. యువతలో మొటిమలు రావడం అనేది చాలా సాధారణ విషయం. ఇది హార్మోన్లకు సంబంధించినది. కాలుష్యం వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగానే..లేడీస్ మోటిమలను లైట్ తీసుకోరు.. వాటిని ఏదో ఒకటి చేసి తగ్గించుకోవాలనే చూస్తారు. అయితే ఒక మహిళ ముక్కుపై చిన్న మొటిమ వచ్చింది. దానిని సాధారణ మొటిమ అనుకుని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. అది ఎర్రటి గడ్డగా మారింది. తర్వాత పుండుగా తయారైంది.. ఆ పుండు నుంచి రక్తస్రావం జరగడం మొదలైంది. డాక్టర్లు.. పరీక్షలు చేయించారు. బయాప్సీ చేస్తే అది చర్మ క్యాన్సర్లలో ఒక రకమైన క్యాన్సర్ అని తేలింది. దాని పేరు బేసల్ సెల్ కార్సినోమా. ఇదేంటి కొత్తగా ఉంది..ఇప్పుడు మొటిలమతో కూడా జాగ్రత్తగా ఉండాలా.. అనుకుంటున్నారా..?
ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. వైద్యులు అక్కడున్న పుండును తొలగించారు. ఒకసారి ఆమె చర్మ కేన్సర్ బారిన పడడం వల్ల భవిష్యత్తులో మళ్లీ ఆ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నట్టు వైద్యులు అంటున్నారు. చర్మ క్యాన్సర్లలో ఒక రకమైనది బేసల్ సెల్ కార్సినోమా. శరీరంలో ఉండే కణాలు బేసల్ కణాలు. పాత కణాలు చనిపోవడంతో బేసల్ కణాలు కొత్త చర్మ కణాలను ఉత్పత్తి చేస్తాయి. తీవ్రమైన సూర్య కిరణాలు కణాలను చేరకుండా చేయడం ద్వారా క్యాన్సర్ రాకుండా ఇవి అడ్డుకుంటాయి. అయితే అవి సమర్ధవంతంగా పనిచేయకుండా క్యాన్సర్ కణాలుగా మారతాయి. అక్కడ కొత్త కణాలు పుట్టవు. పాతవి పుండుగా మారి పేరుకుపోతాయి. కొన్ని రకాల ప్రారంభ లక్షణాల ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు.
లక్షణాలు ఇలా
పుండ్లు, ఎర్రటి పాచెస్, మెరిసే గడ్డలు, మచ్చల్లాంటివి కనిపిస్తాయి.
చిన్న కురుపులు ఎత్తుగా ఎదుగుతాయి.
పొట్టులా రాలుతుంది. దురద, రక్తస్రావం వంటివి జరుగుతాయి.
సూర్యరశ్మి తగిలే ప్రదేశాలలోనే ఇవి వస్తాయి.
చికిత్స ఉందా?
బేసల్ సెల్ క్యాన్సర్ ముందుగానే కనిపెట్టి చికిత్స అందిస్తే ఇది నయమయ్యే అవకాశం ఉంది.
చర్మ క్యాన్సర్లలో 80శాతం మందికి ఇది సోకే అవకాశం ఉంది.
ఈ క్యాన్సర్ కు చికిత్స తీసుకోకుండా వదిలేస్తే అది ప్రాణాంతకంగా మారే ఛాన్సులు ఉన్నాయి.
వేసవిలో మండే ఎండల్లో సూర్య కాంతి చర్మం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే సూర్య కిరణాలలో ఉండే అతినీల లోహిత కిరణాలు చర్మాన్ని తాకి చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే సమ్మర్‌లో సన్‌స్క్రీన్ వాడటం చాలా ముఖ్యం.