వన్ మ్యాన్ షో: ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేత. గొప్ప విజయాలు అందుకున్న నేత..ఇక వరుస విజయాలతో దూసుకెళుతున్న ఎర్రబెల్లి వచ్చే ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ సారి కూడా పాలకుర్తిలో ఆయనకు తిరుగులేదనే పరిస్తితి. పూర్తిగా వన్ మ్యాన్ షో నడుస్తున్న పాలకుర్తిలో మళ్ళీ ఎర్రబెల్లి గెలవడం పక్కా అనే పరిస్తితి.
అయితే ఒకసారి ఎర్రబెల్లి విజయాల రికార్డులని చూసుకుంటే..ఈయన ఎన్టీఆర్ పై అభిమానంతో టీడీపీలో చేరారు. 1983లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలో కీలక పదవులు చేపట్టారు. ఇక 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా వర్ధన్నపేట నుంచి గెలిచారు. తర్వాత పాలకుర్తికి మారి 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. ఇలా అయిదుసార్లు ఆయన టిడిపి నుంచే గెలిచారు. తర్వాత తెలంగాణలో టీడీపీ కనుమరుగవుతున్న నేపథ్యంలో ఎర్రబెల్లి టిఆర్‌ఎస్ లో చేరారు. 2016లో ఆ పార్టీలోకి వెళ్లారు.
ఇక 2018 ఎన్నికల్లో పాలకుర్తి నుంచి రికార్డు మెజారిటీతో గెలిచారు. అలాగే కేసిఆర్ కేబినెట్ లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. మంత్రిగా దూసుకెళుతున్న ఎర్రబెల్లి..తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటారు. అందుకే ఆయనకు పాలకుర్తిలో ఎదురులేకుండా పోతుంది. అయితే ఇప్పుడు అక్కడ ఆయనకు సరైన ప్రత్యర్ధులు లేరు.
అటు కాంగ్రెస్ నుంచి గాని, ఇటు బిజేపి నుంచి బలమైన నాయకులు కనిపించడం లేదు. కానీ కొండా సురేఖ ఫ్యామిలీలో ఎవరోకరు ఎర్రబెల్లి పై పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే ఎవరు పోటీ చేసిన పాలకుర్తిలో ఎర్రబెల్లి విజయాన్ని అడ్డుకోవడం కష్టమే..పవన్ డైలాగ్ మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లు దూసుకెళుతున్నారు.