తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం – ఎంపీ ఉత్తమ్

-

కర్ణాటకలో ఎన్నికల ఫలితాలపై స్పందించారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కర్నాటకలో కాంగ్రెస్ నాయకులు కలిసి పని చేశారని.. అది పార్టీకి బలం అని అన్నారు. బీజేపీ అవినీతిని కర్నాటక ప్రజలు సహించలేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో జనంలోకి బాగా వెళ్ళిందని తెలిపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ కి కలిసి వస్తోందన్నారు.

తెలంగాణలో బీజేపీ లేదని.. బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. ఇక ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు మాట్లాడుతూ.. బీజేపీ రాముణ్ణి మోసం చేసిందన్నారు. 40 శాతం కమిషన్ తో బీజేపీ ఓడిపోయిందన్నారు. తెలంగాణ లో కూడా అధికారంలోకి వస్తామని.. సీఎం ఎవరన్నది కాకుండా… పార్టీ అధికారంలోకి వచ్చేలా పని చేయాలని సూచించారు. సీఎం ఎవరన్నది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news