ఏపీ బీజేపీకి మద్దతుగా చంద్రబాబు సంచలన ట్వీట్..

-

ఏపీ బీజేపీకి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ట్వీట్ చేశారు. కావలి ఎమ్మెల్యే అవినీతిపై చర్యలు కోరుతూ బీజేపీ చేపట్టిన నిరసనలపై పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం అని ట్విట్టర్‌ వేదిక గా ఫైర్‌ అయ్యారు.

ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిచోటా న్యాయానికి ముప్పు వాటిల్లుతుందని మార్టిన్ లూథర్ కింగ్, జూనియర్ వ్యాఖ్యానించారని తెలిపారు. అధికార యంత్రాంగం ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తే ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయని వెల్లడించారు. ఇటువంటి పరిస్థితి పై ప్రజాస్వామ్య పరిరక్షకులందరూ ఐక్యంగా గళం విప్పాలని… ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news