ఈ జీవులు ఒక కంటితోనే చాలా తక్కువ సమయం నిద్రపోతాయట..!!

-

జీవులు: నిద్ర అనేది ప్రాణం ఉన్న ప్రతి జీవికి చాలా అవసరం.. నిద్రపోతే.. బాడీ అంతా యాక్టివ్‌ అవుతుంది. కొత్త ఎనర్జీ వస్తుంది.. మనిషి వరుసగా మూడు రోజులు నిద్రపోకపోతే.. ప్రాణంతకం కూడా అవుతుందని వైద్యులు అంటారు.. అసలు ఈ భూమ్మీద నిద్రపోని కొన్ని జంతువులు ఉన్నాయి తెలుసా..? అవి వాటి జీవితంలో ఏరోజు ప్రశాంతంగా నిద్రపోవు. అవేంటంటే..

నీళ్లలో ఉండే డాల్ఫిన్ ఎప్పుడూ పూర్తిగా నిద్రపోదు. ఒక కన్ను తెరిచి ఉంచి మరో కన్నుమూసుకొని నిద్రపోతుంది. డాల్ఫిన్‌లు ఈవిధంగా ఒక కంటితో పోయే నిద్రను యూనిహెమిస్పెరిక్ స్లీప్ అంటారు.

ఫ్రిగేట్ పక్షి కూడా పూర్తిగా నిద్రపోదు. ఒక గంట నిద్ర పోతే ఈ పక్షికి సరిపోతుంది. గాల్లో ఎగిరే ఈ ఫ్రిగేట్ పక్షి కూడా సముద్రంలో ఉండే డాల్ఫిన్ లాగా ఒక కన్ను మూసుకుని నిద్రపోవడం విశేషం.

ఫ్రూట్ ఫ్లై అనే కీటకం కూడా చాలా తక్కువ సమయం నిద్రపోతుంది. ఈ కీటకం పగటిపూట కేవలం 72 నిమిషాలు మాత్రమే కనుకు తీస్తుంది.

జెల్లీ ఫిష్‌లకు నిద్ర అవసరం లేదని అంటారు. నాడీ వ్యవస్థ కలిగిన జెల్లీ ఫిష్ వంటి జలాచరులు నిద్రపోవంటారు.

బుల్ ఫ్రాగ్ కూడా పూర్తిగా నిద్రపోదు. కప్పల్లో ఇదో ప్రత్యేకమైన జాతిగా ఉంటుంది.

అసలు ఈ జీవులు నిద్రపోకుండా ఎలా ఉంటాయో కదా..! మనకంటే నిద్ర అలవాటు అయింది కాబట్టి.. నిద్రలేకపోతే.. ఎంత ఆగం అవుతుందో తెలుసు.. ఆ జీవులు పుట్టినప్పటి నుంచే.. నిద్రలేకుండా ఉన్నాయి. అందుకే అవి ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయించడం లేదేమో..!

Read more RELATED
Recommended to you

Latest news