మళ్లీ ముద్దులతో రెచ్చిపోయిన నరేష్-పవిత్ర.. వీడియో వైరల్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు అటు శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో కూడా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారిపోయిన ఒకే ఒక్క జంట నరేష్ – పవిత్ర.. పెళ్లి చేసుకోకపోయినా సహజీవనం అంటూ వార్తల్లో నిలుస్తూ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటారు. అయితే ఇదే ఏడాది లిప్ కిస్ తో రెచ్చిపోయి వీడియో రిలీజ్ చేసిన ఈ జంట ఇప్పుడు మళ్ళీ పెళ్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరొకసారి స్టేజ్ పై ముద్దులతో రెచ్చిపోయారు నరేష్ పవిత్ర లోకేష్.

తాజాగా ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి గెస్ట్లుగా వచ్చిన వీళ్లు.. మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈ షో కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇందులోనే ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు నరేష్.. పవిత్రను ముద్దుగా ఏమని పిలుచుకుంటారో చెప్పమని ఓంకార్ అడగగా.. నరేష్ ముద్దుగా తనని అమ్ములు అని పిలుచుకుంటాను.. ఇంకా ప్రేమ ఎక్కువైతే అమ్ము అని.. ఇంకా ప్రేమ ఎక్కువైతే అని సస్పెన్స్ పెట్టి వద్దులే అని వదిలేశాడు నరేష్.

అంతేకాదు ఈ సందర్భంగా ప్రస్తుతం మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని ఓంకార్ ప్రశ్నించగా.. ఆకాశం మీద పడినా.. భూమి బద్దలైనా..మేము కలిసే ఉంటాము.. అంటూ స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి డాన్సులు వేసి స్టేజ్ పైనే రచ్చ చేశారు. అంతేకాదు ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకొని మరీ రెచ్చిపోయారు. దీంతో ఇది కాస్త ఇప్పుడు మరొక హాట్ టాపిక్ గా మారింది. మరొకవైపు తుపాకీ ఎక్కుపెట్టి కాల్చే సమయంలో ఓంకార్ మాట వింటావా? నా మాట నమ్ముతావా? అని నరేష్ ప్రశ్నించగా.. మిమ్మల్ని నమ్ముతానని చెబుతుంది పవిత్ర.. దానికి నరేష్ రియాక్ట్ అవుతూ జీవితాంతం నమ్ముతూనే ఉండాలి.. నీకు మరో ఆప్షన్ లేదు అంటూ తనలో ఉన్న మరో కోణాన్ని చూపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news