దిమ్మతిరిగే ట్విస్ట్: అక్రమ సంబంధం కారణంగా ప్రభుత్వోద్యోగి సస్పెండ్…

-

ఈ రోజుల్లో సమాజంలో అక్రమసంబంధాలు ఎక్కువయిపోతున్నాయి. ఏ ఉపయోగం లేని ఈ పనికిరాని సంబంధం వలన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కాగా తాజాగా అక్రమసంబంధం కారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోయిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం… నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలానికి చెందిన ఉద్యోగిపై సస్పెన్షన్ విధించారు. ఇదే మండలానికి చెందిన పోట్లపూడి గ్రామపంచాయతీలో ఉన్న సచివాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ అయిన చలం వెంకటేష్ ఒక మహిళతో అక్రమసంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్న వీరిద్దరి గురించి వెంకటేష్ భార్య ఎలాగోలా పసిగట్టి.. ఈ విషయం గురించి నెల్లూరు లోని బాలాజీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఈ విషయం గురించి తెలిసిన సచివాలయ అధికారులు వెంకటేష్ ను విధుల నుండి సస్పెండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news