న్యూయార్క్​లో ప్రిన్స్ హ్యారీ దంపతులను వెంటాడిన మీడియా

-

కొన్నిసార్లు మీడియా ప్రవర్తన ఊహకు అందని రీతిలో ఉంటుంది. పెచ్చుమీరి ప్రవర్తించే కొందరు మీడియా ప్రతినిధుల వల్ల మొత్తం పాత్రకేయవృత్తికే మచ్చ వస్తుంది. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ మీడియా కూడా ఇలాగే అదుపుతప్పి ప్రవర్తించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ తనయుడు హ్యారీ, ఆయన సతీమణి మెర్కెల్‌ను మీడియా ప్రతినిధులు కారులో వెంటాడారు. న్యూయార్క్‌లో దాదాపు 2 గంటలపాటు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. మంగళవారం రాత్రి ఒక అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం హ్యారీ, మెర్కెల్‌, ఆమె తల్లి డోరియా రగ్లాడ్‌లు వెళ్తుండగా మీడియా ప్రతినిధులు వెంబడించారు.

సుమారు 2 గంటలపాటు జరిగిన ఈ ఛేజ్‌లో ఇతర కార్లను, పాదచారులను, ఇద్దరు న్యూయార్క్‌ పోలీసులను ఢీకొట్టబోయారని, త్రుటిలో ప్రమాదాలు తప్పాయని హ్యారీ దంపతుల అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన చిత్రాల్లో హ్యారీ, మెర్కెల్‌, రగ్లాడ్‌ ట్యాక్సీలో ఉన్నట్లు కనిపించింది. 1997 ఆగస్టులో హ్యారీ తల్లి డయానాను ఇలాగే మీడియా ప్రతినిధులు పారిస్‌లో వెంబడించడంతో ఆమె కారు ప్రమాదానికి గురై మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news