చిన్నపిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా? ప్రాణాలు పోతున్నాయి జాగ్రత్త..!

-

చిన్నపిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వొద్దని నిపుణులు చెబుతున్నారు..కానీ చాలా మంది పిల్లలకు ఫోన్స్ ను ఇస్తున్నారు..కానీ ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు స్మార్ట్‌ ఫోన్ లు ఇస్తూ స్వయంగా తమ పిల్లలను తమ చేతులతో నాశనం చేస్తున్నారు అంటూ తాజాగా ఒక ప్రముఖ సంస్థ చేపట్టిన అధ్యాయనంలో వెళ్లడి అయ్యింది.. పిల్లలకు ఇవ్వడం మంచిది కాదు అని తెలిసి కూడా ఏదొక సందర్భంలో ఓదార్చడం కోసం ఇస్తున్నారు.. ఇది పెద్దలు చేసే అతి పెద్ద తప్పు..

చిన్న వయసు లో స్మార్ట్‌ ఫోన్‌ లు చూసిన వారు పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆలోచన శక్తి పెరగక పోవడంతో పాటు ప్రతి చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని అధ్యాయనంలో వెళ్లడి అయ్యింది. పెద్ద అయ్యాక కూడా ఇతరులతో కలవక పోవడంతో పాటు ప్రతి చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచించడం వల్ల ఒత్తడి పెరిగి మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు..

ఇక స్మార్ట్‌ ఫోన్‌ లు వాడుతూ మానసిక సమస్యలతో బాధ పడుతున్న వారి సంఖ్య అంతర్జాతీయ సగటుతో పోల్చితే ఇండియా సగటు ఎక్కువగా ఉండటం ఆందోళనకు గురి చేసే విషయం. 10 నుండి 14 ఏళ్ల వయసు ఉన్న భారతీయ పిల్లల్లో 76 శాతం మంది స్మార్ట్‌ ఫోన్ కి బానిస అయినట్లుగా సర్వేలో వెళ్లడి అయ్యింది. వారు ఏకంగా 5 నుండి 8 గంటల పాటు స్మార్ట్ ఫోన్‌ ను చూస్తున్నారట.. అలా వాళ్ళు చాటింగ్ చేస్తూ టెన్షన్ పడుతూ ఒత్తిడికి గురవుతూ సూసైడ్ కూడా చేసుకుంటున్నారని వారు చెబుతున్నారు.. అందుకే పిల్లలకు ఎక్కువగా ఫోన్స్ ఇవ్వరాదని నిపుణులు చెబుతున్నారు.. సో బీ కేర్ ఫుల్..

Read more RELATED
Recommended to you

Latest news