ఫ్యాక్ట్ చెక్: ప్రయివేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ స్కీమ్ ని నిలిపి వేస్తున్నారా..? నిజం ఎంత..?

-

సోషల్ మీడియాలో కనపడే నకిలీ వార్తలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎన్నో నకిలీ వార్తలు మనకి కనబడుతూ ఉంటాయి. రకరకాల ఫేక్ వార్తలు ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అందులో నిజం ఎంత అది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… రేపటి నుండి ప్రైవేట్ ఆసుపత్రి లో ఆరోగ్యశ్రీ స్కీమ్ నిలిచిపోతుందని ఈ వార్తలో ఉంది.

మరి నిజంగా ఆరోగ్యశ్రీ స్కీమ్ ప్రైవేట్ ఆసుపత్రిలో రేపటి నుండి వర్తించదా..? మరి దీనిలో నిజం ఎంత అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ స్కీమ్ నిలిచి పోతుందని వస్తున్న వార్తల్లో నిజం ఏమిటి అనేది చూస్తే… సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త లో ఏమాత్రం నిజం లేదు చాలామంది ఈ వార్త విని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం పై ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరేంద్ర ప్రసాద్ స్పందించారు.

నెట్వర్క్ ఆసుపత్రులకి ఆరోగ్యశ్రీ బిల్లు చెల్లించాము అని అన్నారు. బకాయిలు పెండింగ్లో ఉండడం వలన ప్రైవేట్ ఆసుపత్రులు అలా చెప్పారని తెలిపారు. కాబట్టి ఆందోళన చెందక్కర్లేదు. ఆరోగ్యశ్రీ సేవలు యధావిధిగా కొనసాగుతాయి. ఇది ఇలా ఉంటే ఈ రోజుల్లో చాలా నకిలీ వార్తలు మనకి కనబడుతున్నాయి. ప్రభుత్వం ఉద్యోగాలు మొదలు స్కీముల వరకు చాలా నకిలీ వార్తలు వస్తున్నాయి. అనవసరంగా నకిలీ వార్తలని నమ్మి మోసపోకండి.

Read more RELATED
Recommended to you

Latest news