పాములు: పాములంటే.. ఎంత పెద్ద వారికైనా..ముందు భయం వేస్తుంది.. ఒక్క పామును చూస్తేనే.. చెమటలు పడతాయి.. అలాంటిది.. డజన్ల కొద్దీ పాములు ఒకే చోట ఉంటే.. వెన్నులో వణుకు పడుతుంది కదా..! ఆ చెట్టు మీద డజన్ల కొద్దీ పాములు ఉన్నాయట.. అవి అన్నీ విషసర్పాలే.. అంతే కాకుండా అవి బుసలు కొడుతూ చెట్టు కొమ్మలపై అటు ఇటు పాక్కుంటు వెళ్తున్నాయి.
ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని గౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజ్‌గైవ అడవిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను విషసర్పాలు చెట్టుపై సంచరిస్తున్నాయి.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అసలు పాము అని పేరెత్తడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. పొరపాటున ఎక్కడైన పాములు కన్పించిన ఆ ప్రదేశాల దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహాసించరు. అలాంటిది ఒకే ప్రదేశంలో కుప్పలుతెప్పలుగా పాములు కన్పిస్తే ఎలా ఉంటుంది.
పాములు చెట్టునే తన ఆవాసంగా చేసుకుని ఉన్నట్లున్నాయ్.. అంతే కాకుండా.. బుసలు కొడుతూ, ఒకదానిపై మరోకటి దాడులు కూడా చేసుకుంటున్నాయి. అక్కడ ఉన్న కొందరు యువకులు పాములున్న చెట్టు దగ్గరకు వెళ్లారు. అంతే కాకుండా.. వీటిని వీడియో తీస్తున్నారు. దీంతో పాములు కోపంతో వారిమీద బుసలు కొడుతూ కోపంగా దాడి చేయడం వీడియోలో రికార్డైంది. మరికొందరు పాములను దూరంగా చూస్తు తమ సెల్ ఫోన్‌లలో రికార్డుకూడా చేస్తున్నారు.
పాములు తమ గ్రామానికి దగ్గరగా ఉన్న చెట్లపైన కన్పించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అంతే కాకుండా.. పొరపాటున అవి కాటు వేస్తే పరిస్థితి ఏంటి..? ఈ పాములను ఈ చెట్టు మీద నుంచి తొలగించడం ఎలానో కూడా వారికి తోచడం లేదట..!