సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. ఇంకా తన స్టార్ పొజిషన్ ని మాత్రం ఆమె ఏ మాత్రం చెరగనివ్వలేదు అనడంలో సందేహం లేదు. తన నటనతో క్రేజ్ తో మంచి పాపులారిటీ దక్కించుకున్న నయనతార వరుసగా విజయాలు అందుకుంటూ ఎంతోమంది దర్శక నిర్మాతలకు , హీరోలకు లక్కీ హీరోయిన్గా మారిపోయింది.
ఇకపోతే గత ఏడాది తన ప్రియుడు డైరెక్టర్ విగ్నేష్ ను వివాహం చేసుకున్న ఈమె సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు తల్లి కూడా అయింది. తల్లి అయిన తర్వాత కూడా వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది నయనతార. ప్రస్తుతం షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా నయనతార కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. అదేమిటంటే నయనతార ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే ఇది కూడా బన్నీ బాటలోనే ఆమె నడవాలని నిర్ణయించుకుందట.
ఆమె కొత్త బిజినెస్ ఏమిటి అంటే థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ లో మహేష్ బాబు ఏఎంబి సినిమాలో భాగస్వామిగా , అల్లు అర్జున్ కూడా ఏ ఏ ఏ సినిమాస్ నిర్మాణం జరుగుతుంది.ఇప్పుడు నయనతార కూడా విలాసవంతమైన, అత్యాధునిక ముల్టీప్లెక్స్ని చెన్నైలో నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటికే చెన్నైలో మూతపడ్డ అగస్త్య థియేటర్ ని నయనతార కొనుగోలు చేసి దాని స్థానంలో ఒక కొత్త మల్టీప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. ఇక త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారు ఈ జంట.