తెలంగాణకు మరో శుభవార్త. తెలంగాణకు మరో 2 ఐటీ సంస్థలు రానున్నాయి. కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తుండగా హైదరాబాదులో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తామని మండీ హోల్డింగ్స్ సంస్థ ప్రకటించింది. సుమారు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ చైర్మన్ తెలిపారు. మరోవైపు హైదరాబాదులో 10,000 మంది ఉద్యోగులతో ఎంప్లాయి సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు VXI గ్లోబల్ కంపెనీ ప్రకటించింది.
అలాగే, నిరుద్యోగులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ అదిరిపోయే శుభ వార్త చెప్పారు. హైదరాబాద్ లో కొత్తగా 9,000 ఉద్యోగాల నియామకం చేయనున్నట్లు KTR ప్రకటించారు. కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ Alliant Group హైదరబాద్ లో కొత్తగా 9,000 ఉద్యోగాల నియామకం కు నిర్ణయం తీసుకుందని వివరించారు. ట్యాక్స్, అకౌంటింగ్, ఆడిట్ సర్వీసెస్ మరియు కోర్ ఐటి టెక్నాలజీల లో యువతకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. అలాగే మం త్రి కేటీఆర్ మరో కీలక ప్రకటన కూడా చేశారు.