ఆధునిక భారత నిర్మాత.. రాజీవ్ అని కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నేడు రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి. ఈ తరుణంలోనే.. దేశ వ్యాప్తంగా రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఈ తరుణంలోనే.. రాజీవ్ గాంధీకి..నివాళులు అర్పించారు సోనియా గాంధీ.
వీరభూమిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక అటు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ‘దేశసేవలో ప్రాణత్యాగం చేసిన ధీరోద్దాత… ఆధునిక భారత నిర్మాత… నవయువ స్ఫూర్తి ప్రదాత…’ అని ట్విట్ చేశారు. ఆత్మాహుతి దాడిలో రాజీవ్ మరణించినప్పటి దుస్తుల ఫోటోను షేర్ చేశారు.
దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన ధీరోద్దాత…
ఆధునిక భారత నిర్మాత…
నవయువ స్ఫూర్తి ప్రధాత…మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. #RajivGandhi pic.twitter.com/F7RbeBAjGq
— Revanth Reddy (@revanth_anumula) May 21, 2023