తెలంగాణ ప్రగతి ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాల లోగో

-

రాష్ట్ర ప్రగతిని చూపేలా కాళేశ్వరం, మిషన్‌ భగీరథ వంటి సాగు, తాగునీటి ప్రాజెక్టులను, విద్యుత్‌, వ్యవసాయ తదితర రంగాలను, యాదాద్రి వంటి ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రాలను, మెట్రోరైలు, టి-హబ్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం, 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహంతో.. రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను రూపొందించింది. ఈ లోగోను హైదరాబాద్‌లోని బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌ పాల్గొన్నారు.

తెలంగాణ అస్తిత్వాన్ని చాటేలా తెలంగాణ తల్లి, బతుకమ్మ, బోనాలు, పాలపిట్ట, అమరవీరుల స్మారకానికి స్థానం కల్పించారు.దశాబ్ది ఉత్సవాలకు గుర్తుగా 10 సంఖ్యకు ప్రాధాన్యమిచ్చారు. ఒకటి అంకెలో బోనం, బతుకమ్మలను చేర్చారు. సున్నాను పది భాగాలుగా విభజించి, ఒక్కో భాగంలో ఒక్కో అభివృద్ధి, సంక్షేమ పథకాల బొమ్మలతో, మధ్యలో తెలంగాణ తల్లి చిత్రంతో తీర్చిదిద్దారు.

Read more RELATED
Recommended to you

Latest news